Advertisementt

బండ్ల గణేష్‌కు మెగా ఆఫర్‌ రానుందా!

Wed 15th Apr 2015 04:03 AM
bandla ganesh,megastar chiranjeevi,150th film,puri jagannadh  బండ్ల గణేష్‌కు మెగా ఆఫర్‌ రానుందా!
బండ్ల గణేష్‌కు మెగా ఆఫర్‌ రానుందా!
Advertisement
Ads by CJ

నిర్మాత బండ్ల గణేష్‌ ‘టెంపర్‌’ చిత్రం తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుంటున్నాడు. వ్యక్తిగతంగా విదేశాలు తిరుగుతూ రిలాక్స్‌ అవుతున్నాడు. కాగా రామ్‌చరణ్‌ ప్రస్తుతం శ్రీనువైట్లతో చేసే చిత్రం పూర్తయిన తర్వాత ఆయన సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను రామ్‌చరణ్‌ ఏరికోరి గణేష్‌కు అప్పగించనున్నట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే.. ఇంతకాలం మెగాస్టార్‌ చిరంజీవి నటించే 150 వ చిత్రాన్ని స్వయాన రామ్‌చరణ్‌ నిర్మాతగా రూపొందనుందనే విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నిర్మాతగా రామ్‌చరణ్‌, సురేఖ సమర్పణలో చిరు 150వ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా బండ్ల గణేష్‌తో పాటు ఓ టీవీ చానెల్‌ యజమాని వ్యవహరించనున్నారని, ఆ టీవీ చానెల్‌ యజమాని ఎవరో కాదు.. ఎన్‌ టీవీ అధినేత నరేంద్రచౌదరి అని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ 150 వ చిత్రానికి పూరీజగన్నాథ్‌ దర్శకునిగా ఎంపిక అయ్యాడని కేవలం అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ మాత్రమే మిగిలి ఉందని చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ