తెలుగులో సంప్రదాయ చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన నటి స్నేహ. ఈమె ఇటీవల విడుదలైన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో ఉపేంద్ర సరసన నటించింది. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చిందని, త్వరలో తల్లి కాబోతోందని సమాచారం. ఈ విషయాన్ని ఆమె భర్త ప్రసన్న స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఓ సంతోషకరమైన విషయం మీతో పంచుకుంటున్నాను. మా ఫ్యామిలీలోకి త్వరలో కొత్త మెంబర్ జాయిన్ అవుతారు.. అని ఆయన ట్వీట్ చేశాడు. స్నేహ వివాహం తమిళ నటుడు ప్రసన్నతో 2012 మే11న జరిగింది. ‘అచ్చముండు అచ్చముండు’ చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి... పెళ్లి ద్వారా ఓ ఇంటి వారయ్యారు. పెళ్లి తర్వాత కూడా స్నేహ తన నట జీవితాన్ని కొనసాగిస్తూ... నటిస్తోంది. తల్లి అయినా తర్వాత మాత్రం ఆమె నటిగా కొంత గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది.