Advertisementt

నటుడ్ని మాత్రం పెళ్లి చేసుకోను : సమంత

Tue 14th Apr 2015 11:44 PM
samantha,marriage,actor,siddharth,samantha marriage secrets  నటుడ్ని మాత్రం పెళ్లి చేసుకోను : సమంత
నటుడ్ని మాత్రం పెళ్లి చేసుకోను : సమంత
Advertisement
Ads by CJ

వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. నటుడితో మాత్రం వద్దండి బాబు అంటుంది చెన్నై చిన్నది సమంత. హీరో పేరు చెప్పకముందే నో, అతని ప్రస్తావన తీసుకురావద్దు అంటూ మీడియా ప్రతినిధులతో సున్నితంగా తన మనసులో మాటను చెప్పింది. సిద్దార్ద్, సమంతల మధ్య ప్రేమ, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. సిద్దుతో ప్రేమాయణానికి కటీఫ్ చెప్పిన తర్వాత చెన్నైలో ఒక వ్యాపారవేత్తతో సమంత సన్నిహితంగా తిరుగుతుంది, అతనితో నిశ్చితార్ధం జరగబోతుందని వార్తలు వచ్చాయి. వీటిపై తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. 

ఆ వ్యాపారవేత్త ఎవరో తెలిస్తే ఫోన్ నెంబర్ ఇవ్వండి. అతను ఎం చేస్తున్నారు. నా పని సులువు అవుతుంది, వెతికే శ్రమ తగ్గుతుందని సెలవిచ్చింది. అక్కడి వరకు బాగానే ఉంది. మీడియా అడగకపోయినా నటుడు (యాక్టర్)తో అయితే వద్దు, నో ఛాన్స్ అని తేల్చేసింది. మీడియాలో అందరికి తెలుసు, నా గురించి రాశారు. మళ్లీ ఎందుకు..? నా నోటితో చెప్పించాలని ప్రయత్నిస్తున్నారు. మీ మైండ్ లో ఏముందో అది అడగొద్దని చెప్పింది. 

సిద్దార్ద్ పేరు చెప్పకపోయినా, అతనితో ప్రేమ బెడిసికొట్టడం సమంతను తీవ్రంగా బాధ పెట్టినట్టు అర్ధమవుతుంది. ప్రేమ, పెళ్లి ఆలోచనలను ప్రస్తుతానికి మనసులో నుండి తీసేశానని చెప్తుంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నలకు సమాధానం దాటవేసింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ