Advertisementt

'సన్నాఫ్ సత్యమూర్తి' స్టడీగా నిలబడతాడా?

Tue 14th Apr 2015 11:21 PM
allu arjun,son of satyamurthy,collections,bunny   'సన్నాఫ్ సత్యమూర్తి' స్టడీగా నిలబడతాడా?
'సన్నాఫ్ సత్యమూర్తి' స్టడీగా నిలబడతాడా?
Advertisement
Ads by CJ

స్టార్ హీరోలు నటించిన సినిమాలకు ఓపెనింగ్ వీకెండ్లో భారి వసూళ్లు రావడం సర్వ సాధారణం. సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడం, హీరో ఇమేజ్, అడ్వాన్సు బుకింగ్స్ తదితర అంశాలు ఓపెనింగ్స్ లో కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా ఫలితం, మౌత్ టాక్, రివ్యూలు ఫస్ట్ వీకెండ్ వసూళ్లను ప్రభావితం చేయలేవు. అసలు పరీక్ష సోమవారం మొదలవుతుంది. మండే టెస్ట్ మంటలు పుట్టిస్తుంది. 

వీకెండ్ సెలవులు పూర్తయిన తర్వాత అభిమానులు, ప్రేక్షకులు సినిమాను ఎంత ఆదరిస్తారు అనేదానిపై సినిమా విజయం ఆధారపడుతుంది. మొన్న త్రివిక్రమ్, ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం స్పష్టం చేశాడు. అల్లు అర్జున్ సత్తాకు, సినిమాలో విషయానికి అసలైన పరీక్ష మొదలైంది. సోమవారం నుండి 'సన్నాఫ్ సత్యమూర్తి' స్టడీగా నిలబడతాడా..? లేదా..? అనేది ఇప్పుడు ఆసక్తికరం. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 43.36 కోట్ల రూపాయల గ్రాస్, 30.60 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. తర్వాత కూడా లెక్కలు చెబితే బాగుంటుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ