‘ఆనంద్, వెన్నెల..’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సురపరిచితమైన హీరో రాజా కిందటి సంవత్సరం వివాహం చేసుకొని ఓ ఇంటి వాడయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పండంటి బేబిగర్ల్‌కు తాను తండ్రిని అయ్యానని మురిసిపోతూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఆ ఫొటోలను పోస్ట్ చేశాడు. అతని భార్య అమృతా విన్సెంట్, తను ఈ ముద్దుల బేబీని చూసి మురిసిపోతున్నారు. గత సంవత్సరం రాజా చెన్నైకి చెందిన అమృత విన్సెంట్‌ని పెళ్లాడాడు. అమృత తండ్రి ఫెడ్రిక్ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు క్లోజ్ ఫ్రెండ్ కావడం గమనార్హం....! ఈమధ్య రాజాకు నటునిగా పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాదాపు తెలుగు ప్రేక్షకులు ఆయన్ని మర్చిపోయే స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.