డైరెక్టర్ కాబోయి హీరో అయిన నటుడు నాని ఇటీవల వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. దీంతో ఆయనకు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రానికి ముందు చాలా కోపం వచ్చిందట. వరుసగా దాదాపు 100 కథలు విన్నప్పటికీ తనకు నచ్చిన కథ ఒక్కటి కూడా ఎవ్వరూ చెప్పకపోయే సరికి ఆయనకు కోపం వచ్చి తనే కూర్చొని సొంతంగా ఓ స్టోరీ తయారుచేసుకున్నాడట. ఈ చిత్రాన్ని తానే హీరోగా స్వీయదర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఆయన స్నేహితులు ఆయన్ను కంట్రోల్ చేయడంతో ఆ ప్రయత్నం విరిమించాడట. మొత్తానికి భవిష్యత్తులో కూడా ఆయనకు ఇలాగే మరోసారి కోపం వస్తే మాత్రం హీరో, నిర్మాత, దర్శకుడు... ఇలా అన్నీ తానై సినిమాను తీసే యోచన ఖచ్చితంగా ఆయన మదిలో ఉండే ఉంటుంది. బీ..కేర్ ఫుల్...!