సాధారణంగా మణిరత్నం సినిమా అంటే వేస్టేజీ కూడా ఎక్కువే ఉంటుంది. దరిదాపుల్లో మూడు గంటల పాటు ఆయన చిత్రాలు భారీ నిడివితో ఉంటాయి. కానీ ఆయన తన తాజా చిత్రం ‘ఓకే కన్మణి’ (తెలుగులో ‘ఓకే బంగారం) చిత్రంతో తన రూటు మార్చాడు. నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా షార్ట్ అండ్ స్వీట్‌గా ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించాడట. నేడు వస్తున్న భారీ నిడివి ఉన్న చిత్రాలు వరుసగా ప్రేక్షకులను బోర్ కొట్టిస్తున్నాయి. నేడు తరం ఆడియన్స్ 2 గంటలకు అటు ఇటుగా ఉంటే మాత్రమే సీటులో కూర్కొని చూడగలుగుతున్నారు. అంతేగానీ మూడు గంటల నిడివితో సాగదీసే చిత్రాలను నిర్ధాక్షిణ్యంగా తిరస్కరిస్తుండటంతో దానిని గమనించిన మణి ఈ కొత్తరూటులోకి వచ్చాడు. ‘ఓకే బంగారం’ చిత్రం నిడివి 2గంటల 19 నిమిషాల 42 సెకన్లు మాత్రమే అని తెలుస్తోంది. మరి ఈ చిత్రం మణిరత్నంకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సివుంది....!