ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సినిమా మేకింగ్ కు సంబంధించిన వీడియో విడుదల చేసారు. ప్రేక్షకులలో ఆ వీడియో కొంత మేరకు అంచనాలు పెంచింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు. కానీ ఈ సినిమా టైటిల్ ఇదే అని ఒక టైటిల్ వినిపిస్తుంది.
'మిస్సైల్' అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైటిల్ సినిమా కథకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేయించనున్నారని సమాచారం. సినిమా ఎక్కువ శాతం అడవి నేపధ్యంలో జరుగుతుంది. షూటింగ్ కొంత భాగం సౌత్ ఆఫ్రికా అడవుల్లో జరగనుందని సమాచారం.