Advertisementt

రామ్‌చరణ్‌ సినిమాకు స్ఫూర్తి ఆ సినిమానా?

Mon 13th Apr 2015 03:01 PM
ram charan,srinu vaitla,my name is raju,vijetha movie  రామ్‌చరణ్‌ సినిమాకు స్ఫూర్తి ఆ సినిమానా?
రామ్‌చరణ్‌ సినిమాకు స్ఫూర్తి ఆ సినిమానా?
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్‌`శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ రాజు’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం గతంలో అంటే దాదాపు 30ఏళ్ల కిందట వచ్చిన చిరంజీవి ‘విజేత’ చిత్రం ఆదారంగా రూపొందుతోందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.  ఈ కథలో సెంటిమెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిక్స్‌ చేసి మారిన కాలానికి అనుగుణంగా ఎమోషన్స్‌, సెంటిమెంట్‌ను , కథ నడిచే విధానాన్ని ఈ కాలానికి తగినట్లుగా... శ్రీనువైట్ల మార్క్‌ పూర్తి ఎంటర్‌టైనర్‌గా నడుస్తుందని తెలుస్తోంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం... రామ్‌చరణ్‌కు, తన అక్క (కృతికర్బండా) మధ్య వచ్చే ఎమోషన్స్‌ను బేస్‌ చేసుకొని సినిమా నడుస్తుందంటున్నారు. అక్క కోసం ఎంతకైనా తెగించి ఏదైనా చేసే తమ్ముడు రాజుగా చరణ్‌ నటించనున్నాడట. అక్క కోసం తన  కెరీర్‌ను, తన ఆశయాలను కూడా త్యాగం చేస్తాడని, ఇందులో స్టంట్‌ మేన్‌గా కనిపించి అలరించనున్నాడని తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ