Advertisementt

చైతూ కోరిక నెరవేరుతుందా?

Mon 13th Apr 2015 08:35 AM
akhil,manam movie,dochaye movie  చైతూ కోరిక నెరవేరుతుందా?
చైతూ కోరిక నెరవేరుతుందా?
Advertisement
Ads by CJ

తన సినిమా కెరీర్‌ను దాదాపు ఆరేళ్ల కిందట జోష్‌గా ప్రారంభించాడు అక్కినేని వంశ హీరో నాగచైతన్య. ఏళ్లు గడుస్తున్నాయి... దర్శకులు మారుతున్నారు... సినిమాలు వస్తూనే ఉన్నాయి...కానీ చైతూ కోరిక మాత్రం తీరడం లేదు. తన ఖాతాలో హిట్లు ఉన్నప్పటికీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే చిత్రం ఇప్పటివరకు చైతూకు రాలేదు. తన కెరీర్‌ను మలుపుతిప్పే బ్లాక్‌బస్టర్‌ లేకపోవడంతో స్టార్‌డమ్‌కు కేవలం అడుగుదూరంలో చైతూ ఆగిపోయాడు. ‘మనం’ వంటి పెద్ద హిట్‌ వచ్చినప్పటికీ అది మల్టీస్టారర్‌ ఖాతాలోకి వెళ్లిపోయింది. తాజాగా ఇప్పుడు చైతూ తాను నటించిన ‘దోచెయ్‌’ చిత్రంపైనే నమ్మకం పెట్టుకున్నాడు. భారాన్నంతా దర్శకుడు సుధీర్‌వర్మ, భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌లపై పెట్టాడు. ఈ చిత్రం ట్రైలర్‌ మాత్రం మంచి ఊపుతో అందరినీ అలరిస్తోంది. ఈ ట్రైలర్‌ ఆకట్టుకున్న విధంగానే సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటే తప్ప చైతూ ఆశ నెరవేరేలా లేదు....! మరి చైతూ ఆ ఫీట్‌ను ‘దోచెయ్‌’తో అయినా సాధిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ