సినిమా రంగంలో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సెంటిమెంట్లు వర్కౌట్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ఆసక్తికర సెంటిమెంట్ అందరినీ ఆకర్షిస్తోంది. గత ఏడాది సంక్రాంతికి ఫాదర్ సెంటిమెంట్‌తో మహేష్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘1’ (నేనొక్కడినే) చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయినా కొన్ని వర్గాల ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా విమర్శకుల ప్రశంసలను ఈ చిత్రం పొందింది. కాగా ఇటీవల అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం వచ్చింది. ఈ చిత్రం కూడా ఫాదర్ సెంటిమెంట్‌తోనే రూపొంది డివైడ్ టాక్ తెచ్చుకుంది. కాగా త్వరలో మరోసారి సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘నాన్నకు ప్రేమతో’ అనే ఫాదర్ సెంటిమెంట్ చిత్రం తెరకెక్కించనున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సాధించుకుంటుందో చూడాలంటే వచ్చే ఏడాది జనవరి వరకు వెయిట్ చేయాలి...!