నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సూర్య వర్సెస్ సూర్య’ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్‌గా నటించిన త్రిథాచౌదరి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆమెకు ఓ మంచి ఆఫర్ వచ్చింది. ‘కొత్తజంట’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని అల్లుశిరీష్ నటించనున్న తాజా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం గీతాఆర్ట్స్ బేనర్‌లో రూపొందుతోంది. కాగా ఈ చిత్రానికి దర్శకుడు పరుశురామ్ డైరెక్షన్ చేయనున్నాడు. ‘చుట్టాలబ్బాయ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే అల్లుశిరీష్ సిక్స్‌ప్యాక్ సాధించి ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. వాస్తవానికి ఈ చిత్రం రామ్, రానా, నాగచైతన్య వంటి వారి చుట్టూ తిరిగి చివరకు శిరీష్‌తో సెట్ అయింది.