ప్రముఖ గాయని ఎల్.ఆర్ ఈశ్వరి పేరు గుర్తు చేసుకోగానే ఆమె పాడిన వందల పాటలు నేటికీ వయసుతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతుంటాయి., అటువంటి పాటల్లో లే..లే..లే నా రాజా(ప్రేమనగర్), ఏమిటీ లోకం(అంతులేని కథ), మసక మసక చీకటిలో(దేవుడు చేసిన మనుషులు), నూకాలమ్మను నేను (తాతా మనవడు), భలే భలే మగాడివో(మరో చరిత్ర) వంటి హిట్ సాంగ్స్ గుర్తొస్తాయి. కెరీర్ ప్రారంభంలో ఎమ్.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహదేవన్, ఇళయరాజా వంటి గొప్ప సంగీత దర్శకుల సంగీత సారధ్యంలో ఆమె పాటలు పాడారు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్‌లో కూడా అలపించిన ఘనత ఆమెది. ఇప్పుడు ఈ కథంతా ఎందుకనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.... ఎవరితోనైనా పోల్చే ముందు ఎన్నో విషయాలు ఆలోచిస్తారు మన తెలుగు సినీ ప్రముఖులు. ఓ పోలిక టాలీవుడ్‌లో సంచలనాన్ని సృష్టించింది. అదేమంటారా? దొంగాట టైటిల్‌లో మంచు లక్ష్మి నటిస్తూ ఓ సినిమా నిర్మిస్తోంది. శనివారం ఈ సినిమా పాటల్ని డా.మోహన్‌బాబు విడుదల చేశారు. ఇందులో లక్ష్మిప్రసన్న ‘యాందిరో మీ గాళ్ల ఇర్రవీగే గొప్ప’ అంటూ సాగే ఓ పాట పాడిరది. ఈ ఒక్క పాటకి రఘు కుంచె సంగీతం అందించారు. లక్ష్మికిది తొలి పాటే అయినా ఎంతో క్రిస్పీగా పాడిరది. విన్నవాళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు. మోహన్‌బాబుకి లక్ష్మిని సింగర్‌గా చూడాలనే ఆశట. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం సంగీత రంగంపై మక్కువ చూపలేదట. దొంగాట సినిమాలో ఓ పాట పాడడంతో ఆయన కోరిక తీరింది. ఆ ఆనందంలో ఏకంగా లక్ష్మి పాడిన ఒక్క పాటకే ఎల్.ఆర్.ఈశ్వరితో పోల్చేశారు. తను పాడిరదంటే ఆయన మొదట నమ్మలేదట. విన్నాక ఎంతో బావుందని, ఆ పాట విన్నాక మహా గాయని ఎల్.ఆర్.ఈశ్వరి గుర్తొంచిందని ఆడియో వేదికపై చెప్పారు కలెక్షన్‌కింగ్.
వందల పాటలు పాడిన ఆమెతో ఒక్క పాట పాడిన లక్ష్మిని పోల్చడం మరీ విడ్డూరంగా ఉందని నిన్నటి నుంచీ ఫిల్మ్‌నగర్‌లో గుసగసలు వినబడుతున్నాయి.