Advertisementt

మోసగాడితో మంచు మనోజ్ జత కలిశాడు!

Mon 13th Apr 2015 01:28 AM
mosagallaku mosagasu,sudheer babu,guest roll,manoj in mosagallaku mosagadu  మోసగాడితో మంచు మనోజ్ జత కలిశాడు!
మోసగాడితో మంచు మనోజ్ జత కలిశాడు!
Advertisement
Ads by CJ

సుధీర్ బాబు హీరోగా బోస్ నెల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'మోసగాళ్ళకు మోసగాడు'. క్రైమ్ అండ్ కామెడీ నేపధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు ఘరానా మోసగాడిగా కనిపించనున్నారు. ఈ మోసగాడికి మంచు మనోజ్ జత కలిశాడు. అతిధి పాత్రలో సందడి చేయనున్నాడు. కథకు కీలకమైన పాత్రలో యంగ్ స్టార్ హీరో నటిస్తే బాగుంటుందని దర్శకుడు, హీరో భావించారు. పాత్ర తీరుతెన్నులు, కథకు ఎంత కీలకమో మనోజ్ కు వివరించారు. పాయింట్ నచ్చడంతో మనోజ్ అతిధి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటివలే షూటింగ్ కూడా పూర్తి చేశారని చిత్ర బృందం తెలిపింది. 

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన 'దొంగాట'లో సుధీర్ బాబు అతిధి పాత్రలో నటించాడు. ఓ పాటలో తళుక్కుమని మెరుస్తాడు. ఆ ఫ్రెండ్షిప్ తో మనోజ్, సుధీర్ బాబు సినిమాలో నటించాడు. త్వరలో ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ