‘వెంకటాద్రిఎక్స్‌ప్రెస్’ చిత్రంతో అందరినీ ఆకట్టుకుని ఆ తర్వాత ‘లౌక్యం’తో స్టార్‌హీరోలను కూడా ఆకర్షించిన రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం యమ బిజీగా ఉంది. రవితేజతో ‘కిక్2’, రామ్‌చరణ్-శ్రీనువైట్ల చిత్రం, ఎన్టీఆర్-సుకుమార్‌ల చిత్రాల్లో కూడా ఆమె హీరోయిన్‌గా చాన్స్‌లు కొట్టేసింది. ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం నాకు వరుస అవకాశాలు వస్తున్నాయి. నాకున్న అనుభవానికి, వయసుకి ప్రయోగాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు ... అంటూ పట్టుబట్టి సినిమాలను ఎంచుకోలేను. కాంబినేషన్ నచ్చితే.. ఒప్పేసుకుంటాను. అయినా నా గురించి నేను ఎలాంటి పాత్రల్లో నటిస్తే బాగుంటుందనే విషయం నా కంటే నా దర్శకులకే ఎక్కువగా తెలుసు. వారికి కాక నా సంగతి ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి అంటూ తెలివిగా మాట్లాడుతోంది ఈ అమ్మడు.