హీరో కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా లేడీస్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. అభిమానులను ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తూ ఎంతో స్నేహ పూర్వకంగా ఉంటాడు ప్రభాస్. అయితే హీరోలకు, హీరోయిన్లకు తమ అభిమానాన్ని చాటి చెప్పుకోవడానికి అభిమానులు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కొందరు స్టార్స్ అభిమానులు ఇచ్చిన గిఫ్ట్ లను అపురూపంగా చూసుకుంటూ ఉంటారు.
రీసెంట్ గా ప్రభాస్ వారి ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్ ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట. ప్రభాస్ కు చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న సూర్యనారాయణ గారంటే చాలా అభిమానం. కానీ ఆయన ఇప్పుడు లేరు. వారిని గుర్తు చేసే విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ సూర్యనారాయణ గారి శిలను వారి అభిమాన హీరోకు కానుకగా ఇచ్చారట. ఆ బహుమతిని ప్రభాస్ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని తెలుస్తోంది.