తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, సమంత జంటగా నటించిన ‘కత్తి’ చిత్రం తమిళనాట ఘనవిజయం సాధించింది. దీని డబ్బింగ్, రీమేక్ రైట్స్‌ను నిర్మాత ఠాగూర్ మధు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత తెలుగులో టాప్‌స్టార్స్‌తో రీమేక్ చేయాలని నిర్మాత మధు ఉబలాటపడుతున్నాడు. ఈ చిత్రాన్ని ఆల్‌రెడీ పవన్‌కల్యాణ్‌కు చూపించి డేట్స్ అడిగినప్పటికీ ఆయన ఈ చిత్రాన్ని చేసేందుకు నిరాకరించాడు. తాజాగా ఈ చిత్రాన్ని యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో రీమేక్ చేయడానికి మధు సిద్దమవుతున్నట్లు, ఎన్టీఆర్ కూడా ఈ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక మడత పేచీ ఉంది.
ఈ చిత్రం కథ ఏమిటంటే... కొందరు రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు కలిసి పేదరైతులు భూములు లాక్కోవాలని, ఏకంగా ఊరిని మొత్తం కబ్జా చేయాలని భావిస్తారు. దానికి హీరో ఎదురుతిరిగి ఆ ఊరి రైతులందరి తరపున పోరాడి విజయం సాధిస్తాడు. ఈ స్టోరీలైన్ వింటుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం వంకతో రైతుల భూములు లాక్కోవాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. దానికి అక్కడ భూములున్న రైతులు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సో... ఈ చిత్ర కథకి, ఆంద్రప్రదేశ్ రాజకీయాలకు ఇది మిళితం కావడంతో ఎన్టీఆర్ నేటి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని త్వరలో తన ‘కత్తి’పవర్‌తో సమాధానం ఇవ్వడానికి, తన సత్తా చూపించడానికి ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తోంది.