యువ దర్శకులను, కొత్త తరహా చిత్రాలను ప్రోత్సహించడంలో కింగ్ నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. అనుభవం, వయసుతో నిమిత్తం లేకుండా ప్రతిభకు పట్టం కట్టడం నాగార్జున నైజం. 'స్వామి రా రా'తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన సుధీర్ వర్మకు తనతో ఓ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో కుమారుడు నాగ చైతన్య హీరోగా రూపొందిన 'దోచేయ్' ఆడియో వేడుకలో నాగ్, సుధీర్ వర్మ సినిమాను కన్ఫర్మ్ చేశారు.
'సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని ప్రామిస్ చేశాను. మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని' నాగార్జున చెప్పారు. 'దోచేయ్'కు ముందు సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అవి నిజమేనని ఇప్పుడు స్పష్టం అయ్యింది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం చేస్తున్నారు. వంశి పైడిపల్లి దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. వీటి తర్వాత సుధీర్ వర్మ సినిమా ఉండొచ్చు.