మాతృ రాష్ట్రం తమిళనాడులో ప్రజలు హీరోయిన్ త్రిషపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకోవడం ఎలాగో త్రిషకు అర్ధం కావడం లేదు. సొంత సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరుకావడం కూడా నేరమేనా..? అంటూ బాధపడుతుంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణంగా త్రిష బుక్కయింది. 'లయన్' ఆడియో వేడుకకు చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయారు. ఈ వేడుకలో త్రిష పాల్గొనడం తమిళులకు కోపం తెప్పించింది.
శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయ్యారు. వారంతా తమిళులు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబుకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో చంద్రబాబుతో కలిసి 'లయన్' ఆడియో వేడుకలో త్రిష నవ్వులు చిందించడం వివాదాస్పదం అయ్యింది. త్రిషపై అక్కడ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. త్రిష తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పాపం.. త్రిష. సమస్యను ఎలా పరిష్కరించుకుంటుందో..