Advertisementt

'అల్లుడు శీను' సరసన సీరియల్ బ్యూటీ..?

Sat 11th Apr 2015 04:17 AM
alludu seenu,sai srinivas,bheemaneni,sonarika  'అల్లుడు శీను' సరసన సీరియల్ బ్యూటీ..?
'అల్లుడు శీను' సరసన సీరియల్ బ్యూటీ..?
Advertisement
Ads by CJ

'అల్లుడు శీను'తో హీరోగా పరిచయమైన నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్, తొలి చిత్రంలో ఇద్దరు టాప్ హీరోయిన్లు సమంత, తమన్నాలతో నటించాడు. 'అల్లుడు శీను' తర్వాత చేయబోయే చిత్రంలో కొత్తమ్మాయి సొనారికతో సరిపెట్టుకుంటున్నట్టు సమాచారం.
రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ భీమనేని దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్టయిన 'సుందర పాండ్యన్’ తెలుగు రీమేక్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి సరసన కథానాయికగా సొనారికను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. షూటింగులో సొనారిక పాల్గొంటుందట. దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. తెలుగులో సొనారిక నటించిన మొదటి సినిమా 'జాదుగాడు' ఇంకా విడుదల కాలేదు. అప్పుడే మరో అవకాశం సొంతం చేసుకుంది. హిందీలో 'హరహర మహాదేవ' సీరియల్ ద్వారా సొనారిక బాగా ఫేమస్ అయ్యింది. తెలుగులో కథానాయికగా తన ప్రతిభ చూపాలని ప్రయత్నిస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ