Advertisementt

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా కాపీ మాస్టరేనా!?

Sat 11th Apr 2015 03:37 AM
trivikram srinivas,allu arjun,son of satyamurthy,reality show,tara ram pam  త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా కాపీ మాస్టరేనా!?
త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా కాపీ మాస్టరేనా!?
Advertisement
Ads by CJ

ఇటీవల విడుదలైన త్రివిక్రమ్‌-అల్లుఅర్జున్‌ల కాంబినేషన్‌లో రూపొందిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంలోని ఓ సీన్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సదరు సీన్‌ ఓ బాలీవుడ్‌ సినిమా నుంచి త్రివిక్రమ్‌ కాపీ కొట్టడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే త్రివిక్రమ్‌కు తెలిసి ఈ సీన్‌ను వాడుకున్నాడా? లేక ఇది కాకతాళీయంగా జరిగిందా? అనే చర్చ అన్ని చోట్ల జరుగుతోంది. తండ్రి మరణం తర్వాత ఆస్తులు, బంగళాలు అప్పులవాళ్లకు వదిలేసి, ఓ సాధారణమైన ఇంట్లోకి వస్తుంది బన్నీ ఫ్యామిలీ. అప్పుడు బన్నీ అన్న కూతురు ఈ ఇల్లు ఏమీ బాగాలేదని ఏడుస్తూ గొడవ చేస్తుంది. అప్పుడు ఆమెకు బన్నీ సర్దిచెప్పే క్రమంలో ‘ఇది ఓ రియాల్టీ షో....ఇందులో నువ్వు బాగా నటిస్తే బోలెడన్ని చాక్లెట్స్‌.. ఐస్‌క్రీమ్‌లు ఇస్తారని నమ్మిస్తాడు. ఇలాంటి సన్నివేశమే బాలీవుడ్‌ మూవీ ‘తారా రమ్‌ పమ్‌’ సినిమాలో ఉంది. ఇందులో కార్‌ రేసర్‌ అయిన సైఫ్‌ అలీ ఖాన్‌ ఆస్తులన్నీ కోల్పోతాడు. ఇలాగే చిన్న ఇంట్లోకి వస్తాడు. ఆయన కూతురు కూడా ఇలానే గొడవ చేస్తే ఇది ఓ రియాల్టీషో... ఇందులో మనం పాత్రధారులం అని నమ్మిస్తాడు...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ