Advertisementt

మరో సంచలనానికి తెరలేపనున్న వర్మ!

Sat 11th Apr 2015 03:27 AM
ram gopal varma,killing veerappan,life stories  మరో సంచలనానికి తెరలేపనున్న వర్మ!
మరో సంచలనానికి తెరలేపనున్న వర్మ!
Advertisement
Ads by CJ

ఫలితాలతో సంబందం లేకుండా, తనకిష్టమైన జోనర్‌ ఏదైనా సరే సినిమాలు చేసుకుంటూ వెళ్లడం వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ స్టైల్‌. అనేక నిజజీవిత గాధల ఆధారంగా వివాదాస్పద కథాంశాలను వెత్తుకునే ఆయన ఎప్పటినుండో వీరప్పన్‌ మీద సినిమా చేయాలని భావిస్తూ వస్తున్నాడు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఆయన అతి త్వరలో ప్రారంభించనుందని తెలుస్తోంది. బిన్‌లాడెన్‌ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్‌ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని ఆయనో హీమ్యాన్‌ అని వర్మ అంటున్నాడు. అలాంటి వీరప్పన్‌ను చంపిన ఓ పోలీసు కథతో ఈ ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు  ఆయన చెబుతున్నాడు. మరి ఈ చిత్రంతో వర్మ మరెన్ని వివాదాలను సృష్టిస్తాడో వేచిచూడాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ