చాలాకాలంగా వినిపిస్తున్న వెంకటేష్`రవిబాబుల చిత్రం త్వరలో పట్టాలెక్కనుందని తెలుస్తోంది. వాస్తవానికి సురేష్‌బాబుతో రవిబాబుకు ఉన్న అనుబంధం దృష్ట్యా రవిబాబు తొలిచిత్రం వెంకీ హీరోగా రూపొందాల్సివుంది. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల రవిబాబు ‘అల్లరి’ చిత్రం చేశాడు. ఇప్పుడు ఇంతకాలానికి వెంకటేష్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఈ చిత్రాన్ని స్వయాన సురేష్‌ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కించనుంది. త్వరలో తాను ఓ స్టార్‌ను డైరెక్ట్ చేయనున్నట్లు రవిబాబు తాజాగా హింట్ కూడా ఇచ్చాడు. వెంకటేష్ వంటి ఫ్యామిలీ హీరోతో మోడ్రన్ ఐడియాలజీ ఉన్న వినూత్న దర్శకుడు రవిబాబు ఎలా డీల్ చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు