Advertisementt

ఆ హీరోయిన్ మాకొద్దు: బాలయ్య ఫ్యాన్స్..!

Fri 10th Apr 2015 02:21 PM
anjali,balakrishna,dictator movie,nayanathara  ఆ హీరోయిన్ మాకొద్దు: బాలయ్య ఫ్యాన్స్..!
ఆ హీరోయిన్ మాకొద్దు: బాలయ్య ఫ్యాన్స్..!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ నటించిన 'లయన్' సినిమా ఆడియో వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆయన తదుపరి చిత్రం 'డిక్టేటర్' కు లౌక్యం ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి కోన వెంకట్, గోపీమోహన్ ఇప్పటికే కథ, మాటలు సిద్ధం చేసేసారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో కథానాయికగా అంజలిని సంప్రదించగా బాలయ్య సరసన అని తెలియగానే వెంటనే ఓకే చేసిందట. 

అయితే బాలయ్య అభిమానులకు మాత్రం ఈ విషయం షాకింగ్ గా మారిందట. బాలయ్య సరసన అంజలిని చూడలేమని భావిస్తున్నారట. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా బాలయ్యకు సెంటిమెంట్ గా మారిన నయనతార నటించబోతున్న సంగతి తెలిసిందే. సినిమా కథకు రెండవ  హీరోయిన్ అవసరం ఉండటంతో డైరెక్టర్ శ్రీవాస్ అంజలిని కలిసి స్క్రిప్ట్ ను వివరించాడని తెలుస్తోంది. ఈ అవకాశం రావడంతో అంజలి చాలా హ్యాపీగా ఉంటే బాలయ్య అభిమానులు మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతున్నట్లు టాక్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ