నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా సినిమా 'లయన్' ఆడియో నేడు విడుదలయ్యింది. ఆడియోతో పాటు ట్రైలర్ కూడా ఇంటర్నెట్లోకి వచ్చేసింది. బాలకృష్ణ నుండి అభిమానులు ఆశించే హీరోఇజం, మాస్ యాక్షన్, రొమాన్స్.. అన్నీ 'లయన్' ట్రైలర్‌లో ఉన్నాయి. బాలయ్య సినిమా నుండి అభిమానులు ఎం కురుకుంటారో.. దర్శకుడు సత్యదేవా సరిగ్గా అంచనా వేశాడు.
సిబిఐ ఆఫీసర్‌గా బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గాడ్సే ఎవరు..? అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? అనే అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా కట్ చేశారు. గాడ్సే అయినా వయలేంటే.. బోసు అయినా వయలేంటే.. అనే డైలాగ్ ఆసక్తి కలిగించింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడా..? లేక రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. యాక్షన్ సన్నివేశాలకు సినిమాలో లోటు లేదనే సంగతి ట్రైలర్‌లో స్పష్టం అయ్యింది.
బాలకృష్ణ చెప్పిన పంచ్ డైలాగులకు మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా "ఆటను వేటగా మార్చడానికి నాకు అర సెకను చాలు, దాని అవుట్ పుట్ ఇలానే ఉంటుంది' డైలాగ్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. సోషల్ మీడియాలో ట్రైలర్ విడుదలైన నిమిషాల్లో ఈ డైలాగ్ హాల్ చల్ చేయడం మొదలుపెట్టింది. ఇద్దరు కథానాయికలకు ట్రైలర్‌లో ఇంపార్టెన్స్ ఇచ్చారు. కమర్షియల్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో తను స్పెషలిస్ట్ అని మణిశర్మ మరోసారి ప్రూవ్ చేశాడు. 'లెజెండ్' తర్వాత బాలయ్య నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు విందు భోజనం వడ్డించేలా కనిపిస్తుంది. 'లయన్' ట్రైలర్‌లో బాలకృష్ణ గర్జించాడు. ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. సినిమాపై అంచనాలను పెంచింది.