'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమయ్యి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేస్ లో దూసుకెళ్తున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. తన కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటూ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. తన దగ్గరకి వచ్చే ఆఫర్లను కాదనకుండా రాత్రి, పగలు అని తేడా లేకుండా కష్టపడి పని చేస్తుంది. ప్రస్తుతం ఆమె సురేంద్ర రెడ్డి దర్శకత్వం లో వస్తున్న 'కిక్2' సినిమాలో రవితేజ సరసన నటిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమాలో చివరి పాటను రాత్రి పూట తెరకెక్కిస్తున్నారు. ఈ విషయమై రకుల్ తన ట్విట్టర్ లో 'ఉదయమైనా 'కిక్2' చివరి పాట షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ సాంగ్ మంచి కిక్ ను ఇచ్చింది. హై ఎనర్జీతో రాత్రంతా డాన్స్ చేస్తూనే ఉన్నాం' అని ట్వీట్ చేసింది. మరి రాత్రి సమయంలో షూటింగ్ అంటే చుట్టూ ఉండే వాతావరణం కిక్ ఇచ్చేలా ఉండాలి కదా. ఆ కిక్ రకుల్ కు దొరికిందట..!