బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఒక సినిమాకు 40 నుండి 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడని వార్తలు ఉన్నాయి. కానీ అమీర్ ఖాన్ సినిమా ఫ్లాప్ అయితే ఒక్క రూపాయి కుడా తీసుకోడట. సినిమా హిట్ అయితే మాత్రం వచ్చిన లాభాలలో 40 శాతం పారితోషికంగా తీసుకుంటాడట. ఈ మధ్యకాలంలో దక్షిణాదిలో ఎన్నో కోట్లు పెట్టి నిర్మిస్తున్న సినిమాలు పరాజయం పొందుతున్నాయి. దీంతో నిర్మాతలకు నష్టాలు చేకురుతున్నాయి. అందువలన దక్షినాది నిర్మాత మండలి అమీర్ ఖాన్ ను ఫాలో అవ్వమని స్టార్ హీరోలందరికీ చెప్పే ప్రయత్నం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
అయితే ప్రముఖ తమిళ స్టార్ హీరో సూర్య అమీర్ ను అనుకరించడానికి ముందుకు రావడంతో తమిళంలో కొందరు హీరోలు ఈ విధానాన్ని అంగీకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తెలుగులో మాత్రం మన హీరోలు ఈ విషంపై ఆసక్తిగా లేరని తెలుస్తోంది. వారిని అడిగే నిర్మాతలు కూడా లేరని వార్తలు వినిపిస్తున్నాయి.