మోస్ట్‌ఎవెయిటెడ్ మూవీ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' గురువారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక సినిమా విడుదలవుతున్న థియేటర్లను అందంగా అలకరించడంతోపాటు ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. అయితే ఇవే ఫ్లెక్సీలు అల్లు అర్జున్ అభిమానుల మధ్య చిచ్చుపెట్టాయి. కడప జిల్లా కొడుమూరు పట్టణంలోని ఓ సినిమా థియేటర్‌లో అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఫ్లెక్సీలు వివాదం రేపాయి. దీంతో రెండు వర్గాల అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇక పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగినా కొందరు అల్లు అర్జున్ అభిమానులు థియేటర్ ముందు ధర్నాకు దిగారు. దీంతో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించుకొని అభిమానులకు నచ్చజెప్పి ఆందోళన విరమించేలా చేశారు.