Advertisementt

తల్లిదండ్రులను హత్య చేసిన తెలుగు ప్రొడ్యూసర్‌..!!

Wed 08th Apr 2015 01:11 PM
bejjam rajesh putra,murder,parents  తల్లిదండ్రులను హత్య చేసిన తెలుగు ప్రొడ్యూసర్‌..!!
తల్లిదండ్రులను హత్య చేసిన తెలుగు ప్రొడ్యూసర్‌..!!
Advertisement
Ads by CJ

అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండి అరెస్టయిన కేసులో జైలులో ఉన్న తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌, దర్శకుడు బెజ్జం రాజేశ్‌పుత్రకు సంబంధించి మరో సంచలనాత్మక విషయం బయటకు వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజేశ్‌ సినీ ప్రొడ్యూసర్‌గా మారి పలు చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఒరిస్సాలో నివాసముంటున్న రాజేశ్‌ తల్లిదండ్రులు ఏడాది కాలంగా కనిపించడం లేదు. దీనిపై ఫిర్యాదు అందుకున్న అక్కడి పోలీసులు విచారణ చేపట్టగా రాజేశే వారిద్దర్ని హత్యచేసి శవాలు కనిపించకుండా మాయం చేసినట్లు ఒరిస్సా పోలీసులు తేల్చారు. అంతేకాకుండా ఏలూరు పోలీస్‌స్టేషన్‌లో కూడా అతనిపై కేసులు నమోదయ్యాయని, ఆయనపై రౌడీషీట్‌ కూడా ఉన్నట్లు తేలింది. ఇక రాజేశ్‌ అరెస్టు గురించి తెలుసుకున్న ఒరిస్సా పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి విచారణ జరిపారు. తన సొంత తండ్రిని, మారుతల్లిని రాజేశ్‌ లా హత్య చేశాడన్న విషయాన్ని తెలుసుకోవడానికి వారు ప్రయత్నించారు. రాజేష్‌ తెలుగులో నవాబ్‌ పాషా, దావూద్‌ వంటి చిత్రాలను నిర్మించాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ