ఈ రోజు ఉదయం అందరికి ఛార్మి పెద్ద షాక్ ఇచ్చింది. 'గెట్టింగ్ మారీడ్ టుడే.. ఈ రోజే పెళ్లి చేసుకుంటున్నాను' అని ట్విట్టర్లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. అభిమాన తార పెళ్లి చేసుకుంటుందని కొందరు భాదపడితే, ఛార్మికి ఇంత త్వరగా పెళ్లి చేసుకోవలసిన అవసరం ఏముందని మరికొందరు ఆలోచించారు. కాసేపటికి తత్వం బోధపడింది. ఇది రియల్ మ్యారేజ్ కాదు, రియల్ లైఫ్ కోసం చేసుకుంటున్న మ్యారేజ్ అని.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఛార్మి నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'జ్యోతిలక్ష్మి'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ సినిమా కోసమే ఛార్మి పెళ్లి పీటలు ఎక్కుతుందని సమాచారం. నుదుట బాసికం, ఒంటి మీద బంగారు ఆభరణాలు, చక్కని చీరలో ఛార్మి భలే ఉంది. పెళ్లి కూతురుగా ఛార్మిని చూస్తే.. నిజ జీవితంలో కూడా పెళ్లికి సమయం దగ్గర పడింది. అనిపిస్తుంది కదూ..!