Advertisementt

మన హీరోల మైండ్‌సెట్ మారింది!

Tue 07th Apr 2015 07:00 AM
tollywood heroes,telugu titles,allu arjun,jr ntr,nannaku prematho  మన హీరోల మైండ్‌సెట్ మారింది!
మన హీరోల మైండ్‌సెట్ మారింది!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టైటిల్స్ ట్రెండ్ మారిపోయింది. పూర్తి మాస్ టైటిల్.. పవర్‌ఫుల్ టైటిల్ కోరుకునే ఈతరం హీరోల మైండ్‌సెట్‌లో మార్పు కనిపిస్తోంది. పవన్‌కళ్యాణ్ సినిమాకు ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్‌ని పెట్టి ఈ ట్రెండ్‌కు పవన్, త్రివిక్రమ్‌లే శ్రీకారం చుట్టారు. సాఫ్ట్ టైటిల్స్‌తో వచ్చిన ఆ సినిమా తెలుగు సినీచరిత్రను తిరగరాస్తూ సరికొత్త రికార్డులు సృష్టించింది.సున్నితమైన కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కిన ఆ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ నీరాజనం పట్టారు. ఈ విజయాన్ని చూసిన ఇతర  హీరోలు కూడా ఇక నుంచి తమ చిత్రాలకు  కథకు తగ్గట్టుగా సాఫ్ట్ టైటిల్స్‌నే కోరుకుంటున్నారు. రామ్‌చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’తో పాటు ప్రస్తుతం అల్లు అర్జున్‌తివిక్రమ్ కలయికలో రాబోతున్న సన్నాఫ్ సత్యమూర్తి, కొరటాల శివ,మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్-సుకుమార్‌ల ‘నాన్నకు ప్రేమతో..’ ఇలా టైటిల్స్ వినసొంపుగా, ఎటువంటి శబ్ధ కాలుష్యం లేకుండా రావడం చూస్తే అందరికి ముచ్చటేస్తుంది కదూ..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ