Advertisementt

పాపం.. అనుష్క అనుకోవడం ఖాయం!

Sun 05th Apr 2015 01:24 PM
anushka sharma,bollywood media,target,virat kohli,raina marriage  పాపం.. అనుష్క అనుకోవడం ఖాయం!
పాపం.. అనుష్క అనుకోవడం ఖాయం!
Advertisement
Ads by CJ

అనుష్కను మీడియా టార్గెట్ చేసిన తీరుకు అందరూ పాపం.. అనుష్క అనుకోవడం గ్యారెంటీ. ప్రతిరోజూ ఉదయం పేపర్ చదివిన తర్వాత, ఇంటర్నెట్లో న్యూస్ చూసిన తర్వాత సినీ ప్రేక్షకులు, అనుష్క అభిమానులు ఇలా అనుకోవడం సహజం. బి టౌన్ మీడియా అనుష్కను అంతలా టార్గెట్ చేసింది. ఆమె లేకుండా ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ న్యూస్ ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు. రెండు రోజులకొకసారి అయినా అనుష్క వార్తలలో కనిపిస్తుంది. 

ఏప్రిల్ 3న క్రికెటర్ సురేష్ రైనా వివాహం ఢిల్లీలో జరిగింది. టీం ఇండియా కెప్టెన్ ధోని, శిఖర్ ధావన్, ఇర్ఫాన్, ఇషాంత్ శర్మ, అనుపమ్ ఖేర్ తదితరులు హాజరయ్యారు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ గైర్హాజరు కావడం మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. విరాట్ కోహ్లి స్వస్థలం ఢిల్లీనే. పెళ్లి రోజున విరాట్, అనుష్కలు ఢిల్లీలో ఉన్నారు. ఎందుకు రైనా పెళ్ళికి రాలేదు అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవి చూసి అనుష్క అసహనం వ్యక్తం చేసిందట. నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. నా సమస్యలు, పనులు నాకుంటాయి. ప్రతిదాన్ని బూతద్దంలో చూపిస్తే ఎలా..? మీడియా నన్ను టార్గెట్ చేస్తుంది. అంటూ ముంబై మీడియాపై ఆగ్రహంతో ఉందని సమాచారం. అనుష్క ఆవేదనలో నిజం ఉంది కదూ!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ