Advertisementt

శృతి హాసన్, తమన్నాలది ఒకే సమస్య!

Sun 05th Apr 2015 08:38 AM
tamanna,shruti haasan,nagarjuna,karthi,pvp,dates problem   శృతి హాసన్, తమన్నాలది ఒకే సమస్య!
శృతి హాసన్, తమన్నాలది ఒకే సమస్య!
Advertisement
Ads by CJ

శృతి హాసన్ సమస్యే తమన్నాకు ఎదురైంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక కింగ్ నాగార్జున, కార్తీ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా నుండి శృతి హాసన్ తప్పుకుంది. శృతి తప్పుకున్న వెంటనే ఈ సినిమాలో తమన్నా నటిస్తుందని ప్రచారం జరిగింది. మిల్క్ బ్యూటీ కూడా ఈ సినిమా చేయడానికి సానుకూలంగా స్పందించింది. కానీ, చివరలో చిన్న మెలిక పెట్టింది. 

పివిపి సంస్థ నిర్మించే సినిమా కోసం డేట్స్ సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాగానే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. శృతి సమస్య చూసిన తర్వాత తమన్నా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు అర్ధమవుతుంది. 

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ 'బెంగాల్ టైగర్', తమిళంలో మరో సినిమాలో మాత్రమే నటిస్తుంది తమన్నా. వాటి షూటింగులకు క్లాష్ రాకుండా పివిపి సినిమాకు డేట్స్ కేటాయించడానికి ప్రయత్నిస్తుంది. తమన్నా మాటలు చూస్తుంటే దాదాపు ఈ ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ చేసినట్టే అనిపిస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ