కథా రచయితలకు గోపీచంద్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మంచి కథ దొరికితే సన్నిహిత మిత్రుడు ప్రభాస్‌తో కలిసి నటించడానికి సిద్దమని ప్రకటించాడు. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుతున్నారు. దీనిపై గోపీచంద్ స్పందిస్తూ.... మేమిద్దరం కలసి నటిస్తే సినిమాపై అంచనాలు పెరుతాయి. ఇద్దరికీ తగ్గ కథ దొరకాలి కదా. కథలు వింటున్నాం. సరైన స్క్రిప్ట్ దొరకలేదని అన్నారు. తెలుగులో రచయితల కొరత ఉంది. ఇంగ్లీష్, కొరియన్ సినిమాలు చూస్తే కథలు, ఐడియాలు రావు. మన సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. జనంలోకి వెళ్తే అవి తెలుస్తాయి. అనేక కథలు పుడతాయి. అని అన్నారు.
విప్లవాత్మక చిత్రాల్లో నటించాలనుంది. 30 ఏళ్ళ క్రితం నాన్నగారు తీసిన చిత్రాలు, ఈ కాలంలో రావడం లేదు. ఇప్పుడలాంటి చిత్రాలు తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అలాంటి కథ రాయాలంటే సమాజాన్ని సున్నితంగా పరిశీలించాలి. అని గోపీచంద్ అన్నారు.
స్టార్ హీరోలు ఎప్పుడూ రొటీన్ కథలు, సినిమాలు చేస్తారెందుకు..? అనే ప్రశ్నకు గోపీచంద్ సమాధానం ఇచ్చారు. మంచి కథలు తీసుకొస్తే మల్టీస్టారర్, విప్లవాత్మక చిత్రాల్లో నటించడానికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతా రచయితల చేతిలో ఉంది.