Advertisementt

‘గబ్బర్‌సింగ్‌2’పై వివరణ ఇచ్చిన శరత్‌మరార్‌...!

Sat 04th Apr 2015 06:08 AM
sarath marar,pawan kalyan,gabbar singh 2,script work  ‘గబ్బర్‌సింగ్‌2’పై వివరణ ఇచ్చిన శరత్‌మరార్‌...!
‘గబ్బర్‌సింగ్‌2’పై వివరణ ఇచ్చిన శరత్‌మరార్‌...!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌, బాబిల కాంబినేషన్‌లో పవన్‌ స్నేహితుడు శరత్‌మారార్‌ రూపొందించే ‘గబ్బర్‌సింగ్‌2’ చిత్రం ఆగిపోయిందని, దర్శకుడిని మరలా తీసేశారని, ఇక ఈ చిత్రం అటకెక్కినట్లే అంటూ రోజుకో వార్త మీడియాలో రావడం కామన్‌ అయిపోయింది. దానికి తగ్గట్లుగానే సినిమా చాలాకాలం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లకుండా నత్తనడకన నడుస్తోంది. ఇక ఈ చిత్రం యూనిట్‌ కూడా తమకు సంబంధం లేదన్నట్లుగా ఎవ్వరూ ఏమీ మాట్లాడకపోవడం వల్ల కూడా ఈ చిత్రంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్మాత శరత్‌మరార్‌ మీడియాకు ఈ చిత్రం విషయంలో క్లారిటీ ఇచ్చాడు. స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని, భారీ సినిమా కాబట్టి కావాలసిన అంశాలను పక్కాగా ఖరారు చేసుకుంటున్నాం. దర్శకుడు  బాబీ స్క్రిప్ట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగిన తర్వాత షూటింగ్‌ ఎప్పటి నుండి అనే విషయాన్ని అధికారికంగా మేమే ప్రకటిస్తాం... అంటూ వివరణ ఇచ్చారు. ఇకనైనా ‘గబ్బర్‌సింగ్‌2’పై జరుగుతున్న ప్రచారాలు ఆగుతాయని ఆశిద్దాం.....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ