ఈసారి ‘మా’ ఎన్నికలు మినీ యుద్దాన్ని తలపించాయి. ఎప్పుడు లేని విధంగా నువ్వెంత అంటే నువ్వెంత? నీ బతుకు మాకు తెలుసు అంటూ రోడ్డునపడ్డారు. ముఖ్యంగా నటి హేమ, శివాజీరాజా ఎపిసోడ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. నీ బతుకు నాకు తెలుసు అంటే నీ బతుకు నాకు తెలుసు అంటూ కవ్వించుకున్నారు. ఎన్నికలు ముగిసినా కూడా ఈ వేడి చల్లారలేదు. శివాజీరాజా తనను వ్యక్తిగతంగా దూషించాడని హేమ రాద్దాంతం చేయడమే కాదు.. ఏకంగా శివాజీరాజా మీద పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. చివరకు తన పంచాయతీని దాసరి దగ్గరకు తీసుకెళ్లింది. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ను కూడా కలుస్తానని అంటోంది. అవసరమైతే పవన్ ఇంటిముందు కూర్చొని న్యాయపోరాటం చేస్తానని ఆయననే న్యాయం అడుగుతానంటోంది. ఎన్నికల్లో ఢీ కొట్టుకొని రోడ్డు మీద పడిరది ఎవరు? వారికి పవన్‌కు అసలు ఏమిటి సంబంధం? హేమ, శివాజీరాజాల మద్య గొడవ విషయంలో పవన్‌ను కలిసి ఆయన ఇంటి ముందు న్యాయపోరాటం చేయడం ఏమిటి? అసలు వీటికి పవన్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ విషయంలో పవన్ మాత్రం ఏమి చేయగలడు? ఇదంతా డ్రామాగా అనుకోవాలా? లేదంటే పబ్లిసిటీ స్టంట్ అని సర్థిపెట్టుకోవాలా? అనేది అర్థం కావడం లేదు.