Advertisementt

నామకరణం చేసింది బాలయ్యేనంట..!

Sat 04th Apr 2015 05:23 AM
balakrishna,satyadeva,lion,screen name,satyanarayana  నామకరణం చేసింది బాలయ్యేనంట..!
నామకరణం చేసింది బాలయ్యేనంట..!
Advertisement
Ads by CJ

సాధారణంగా చాలామంది వెండితెరకు పరిచయమయ్యేటప్పుడు తమ అసలు  పేరును కాకుండా స్క్రీన్‌ నేమ్‌గా మరోటి పెట్టుకుంటారు. జ్యోతిష్య పరంగా కూడా తమకు మంచి బలం చేకూరేలా ఆ పేర్లను పెడతారు కూడా! కాగా కొందరు ఎవరికైనా వెండితెర పేరును నామకరణం చేసేటప్పుడు ఆయా మార్పులు సూచించి.. మంచి పేరును పెడుతుంటారు. ఆ పేరు క్లిక్‌ అయితే ఇక వారికి తిరుగే ఉండదు. సాధారణంగా కొత్తవారితో పని చేసే వారికే ఈ అవకాశం వస్తూ వుంటుంది. ఇలా పేరు మార్చుకొని పెద్ద పెద్ద స్టార్స్‌గా మారిన వారిలో శోభన్‌బాబు, చిరంజీవి, రజనీకాంత్‌,  మోహన్‌బాబుల  నుండి ఎందరో ఉన్నారు. కాగా ఈతరం నటీనటుల్లో జ్యోతిష్యం, వాస్తు, శుభముహూర్తాలు వంటి వాటిని బాగా నమ్మడమే కాకుండా వాటిపై మంచి పట్టు ఉన్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన గతంలో కూడా చాలా మంది కొత్తవారికి వెండితెర పేరును పెట్టిన అనుభవం ఉంది. 

తాజాగా బాలకృష్ణ ఒక దర్శకునికి ఇలాగే కొత్త పేరు నామకరణం చేశాడట. ప్రస్తుతం బాలకృష్ణ సత్యదేవా అనే నూతన దర్శకునితో ‘లయన్‌’ సినిమా చేస్తున్నాడు. ఆయనకు ఇదే మొదటి సినిమా. ఆయన అసలు పేరు సత్య అలియాస్‌ సత్యనారాయణ. కానీ అతనికి ఎప్పటినుండో ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ అవకాశాలు రాలేదు. ఎట్టకేలకు ఆయన్ను బాలకృష్ణ తన సినిమాకు దర్శకునిగా ఎన్నుకున్నాడు. ఆ యువకుడిలోని ప్రతిభను చూసి అవకాశం ఇచ్చిన బాలయ్య అతని పేరులో పెద్దగా బలం లేదని భావించి  సత్య అలియాస్‌ సత్యనారాయణను సత్యదేవాగా నామకరణం చేశాడు. మరి ఇక ఈ చిత్రం హిట్‌ అయితే సత్యదేవా పేరు మారుమోగుతుంది. అదంతా.. బాలయ్య నామకరణ ప్రభావం ఎంత? అనే దానిపై ఆధారపడి ఉందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ