Advertisementt

నవదీప్‌కు మంచి అవకాశం !

Fri 03rd Apr 2015 11:06 AM
navadeep,al vijay,nanna fame,arintalam,teja,navadeep new movie  నవదీప్‌కు మంచి అవకాశం !
నవదీప్‌కు మంచి అవకాశం !
Advertisement
Ads by CJ

టాలెంట్‌ ఉన్నప్పటికీ తన కెరీర్‌లో ఇప్పటివరకు సరైన విజయాన్ని సొంతం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న హీరో నవదీప్‌. తేజ ద్వారా పరిచయం అయినప్పటికీ ఈయనకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. తెలుగులో బి గ్రేడ్‌ చిత్రాల్లో నటిస్తూ పోతున్నాడు. కాగా నవదీప్‌ కోలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా చిరపరిచితమే. జోనర్‌తో సంబందం లేకుండా వచ్చిన ప్రతి చాన్స్‌ను అంగీకరిస్తూ బండి లాక్కొస్తున్నాడు. కాగా నవదీప్‌కు ఇప్పుడు తమిళంలో ఓ మంచి అవకాశం వచ్చింది. దాదాపు ఆరేళ్ల తర్వాత మరో స్ట్రెయిట్‌ సినిమాలో నటించే అవకాశం ఈ హీరోకువచ్చింది. ‘నాన్న’ ఫేమ్‌ ఏ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో ‘ఇదు ఎన్నా మాయా’ అనే చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. గతంలో ఆయన ‘అరింతలమ్‌, అరియమములకు, నెన్జిల్‌ జిల్‌జిల్‌, ఏగన్‌’ తదితర సినిమాలతో  తమిళ ప్రేక్షకులలో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా చేస్తున్న  చిత్రం హిట్టయితే కనీసం తమిళంలో అయినా.. సరైన అవకాశాలు వస్తాయనే ఆశతో నవదీప్‌ ఉన్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ