Advertisementt

'సన్నాఫ్ సత్యమూర్తి' టీం కొత్త ప్లాన్!

Fri 03rd Apr 2015 10:04 AM
son of satyamurthy,2 times editing,son of satyamurthy team new plan,sos new promotion  'సన్నాఫ్ సత్యమూర్తి' టీం కొత్త ప్లాన్!
'సన్నాఫ్ సత్యమూర్తి' టీం కొత్త ప్లాన్!
Advertisement
Ads by CJ

విడుదలకు ముందే మరోసారి ఎడిటింగ్‌....!

అల్లుఅర్జున్‌ - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రూపొందిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని ఈ నెల 9 వతేదీన గ్రాంగ్‌ రిలీజ్‌కు సన్నాహాటు మొదలుపెట్టింది. కాగా ఈ చిత్రం లెంగ్త్‌ దాదాపు 165 నిమిషాలు అని తెలుస్తోంది. ఇతరుల సినిమాలు అయితే మాత్రం ఈ నిడివి చాలా ఎక్కవనే చెప్పాలి. కానీ త్రివిక్రమ్‌ టేకింగ్‌, డైలాగులు, బన్నీ పర్ఫార్మెన్స్‌, బన్నీ స్టైల్‌ వంటివి  లెంగ్త్‌ విషయంలో ప్రేక్షకులకు బోర్‌కొట్టనివ్వవు అనే నమ్మకంతో యూనిట్‌ ఉంది. అయినా ఇన్ని ప్లస్‌లు ఉన్నా... సినిమా థియేటర్‌లో అంతసేపు ఆడియన్స్‌ బోర్‌లేకుండా ఓపిగ్గా కూర్చుంటారా? అనే అనుమానం ఆ యూనిట్‌కు కలిగిందట. ఎందుకైనా మంచిదని సెన్సార్‌ తర్వాత ఓ 15 నిమిషాల నిడివికి ట్రిమ్‌చేస్తున్నారు. మొదట ఈ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించిన తర్వాత 10, 15 నిమిషాల తర్వాత మరలా ఈ 15నిమిషాల సీన్స్‌ను మరలా సినిమాకు జోడిరచి, రిపీట్‌ ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించే ప్లాన్‌లో త్రివిక్రమ్‌, బన్నీ ఉన్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ