నేటి సినీ పరిశ్రమలో మూడు పదుల వయసు దాటిన కథానాయికలకు అవకాశాలు రావడం కష్టమనే భావన బలంగా వుంది. కొత్త నాయికలజోరులో సీనియర్స్‌కు పెద్దగా అవకాశాలు వరించవనేది సినీ పండితుల అంచనా. అయితే తమిళ పరిశ్రమలో నయనతార హవాను చూస్తుంటే ఈ విషయంలో ఆమె మినహాయింపనే చెప్పాలి. ప్రభుదేవాతో లవ్‌ఫెయిల్యూర్ తర్వాత.. సరిగ్గా రెండేళ్ల క్రితం సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది నయనతార. శ్రేయాభిలాషుల సలహాతో మనసు మార్చుకున్న ఆమె తిరిగి సినిమాలవైపు దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆమె తమిళంలో ఏడు చిత్రాల్లో నటిస్తూ అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. నయనతార నటిస్తున్న నన్‌బెండ, భాస్కర్ ది రాస్కెల్, మాస్, మాయ, ఇందునమ్మ అలు, తని ఒరువన్, నానుమ్‌రౌడీతాన్ చిత్రాలు రాబోవు మూడునెలల్లో ప్రేక్షకులముందుకురానున్నాయి. ఓ కథానాయిక నటించిన ఏడు చిత్రాలు మూడు నెలల వ్యవధిలో విడుదల కావడం ఈ దశాబ్దకాలంలో జరగలేదని, తమిళ చిత్రసీమలో ఇదొక రికార్డ్‌గా వుంటుందని అంటున్నారు. సో.. ఎంతైనా నయనతార మనో నిబ్బరాన్ని మెచ్చుకోకుండా వుండలేము కదా..!