మహిళా సాధికారకత అంశంపై దీపికాపదుకునే నటించిన షార్ట్‌ఫిల్మ్ ‘మై ఛాయిస్’ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ లఘుచిత్రం కారణంగా ఈ అందాలభామ వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటోంది. తాజాగా దీనిపై బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా స్పందించింది. లఘ చిత్రంలో చెప్పిన విధంగా మహిళా సాధికారత అంటే తమకు తోచిన రీతితో వుండటం, ఇష్టమైన దుస్తుల్ని ధరించడం, పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనడం కాదని..దేశంలోని మారుమూల గ్రామాల్లో మహిళల జీవన ప్రయాణాల్ని మెరుగుపరచడం, వారిని ఆర్థికంగా శక్తివంతంగా తయారుచేయడమని సోనాక్షి తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను దీపికాపదుకునే నటించిన వీడియోను చూడలేదు. కానీ అందులో ఆమె వ్యక్తం చేసిన ఫీలింగ్స్ తెలుసుకున్నాను. సాటి మహిళల కోసం దీపికాపదుకునే ఓ మంచి ప్రయత్నమే చేసింది. అయితే ఆమె చెప్పిన విషయాలు ఆమోదయోగ్యంగా వుంటే బాగుండేది. సంపన్న వర్గాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా అట్టడుగు వర్గాల మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈ లఘ చిత్రాన్ని తీసివుండే బాగుండేది’ అని సోనాక్షి దీపికాపై ఫైర్ అయింది.