Advertisementt

అనుష్క సినిమాలో బాలీవుడ్ భామ..!

Fri 03rd Apr 2015 04:02 AM
anushka,isha guptha,size zero movie,sruthihasan  అనుష్క సినిమాలో బాలీవుడ్ భామ..!
అనుష్క సినిమాలో బాలీవుడ్ భామ..!
Advertisement
Ads by CJ

ఆర్య, అనుష్కశెట్టి ప్రధాన పాత్రల్లో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో పి.వి.పి. నిర్మిస్తున్న సినిమా 'సైజ్ జీరో'. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఇది ఓ రొమాంటిక్ కామెడీ సినిమా. అయితే ఈ చిత్రం ద్వారా ఓ బాలీవుడ్ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుందట. 'జన్నత్ 2' లో నటించిన డస్కీ బ్యూటీ ఇషా గుప్తా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమాలో శ్రుతిహాసన్ అతిథి పాత్రలో మెరవనుంది. ఇప్పుడు మరో భామ కూడా నటించడం ఆడియన్స్ కు ఈ సినిమాపై అంచనాలు పెరిగే విధంగా చేస్తుంది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ