Advertisementt

మరో ‘మణి’ పూస...!

Fri 03rd Apr 2015 03:57 AM
ok kanmani,ok bangaram,dilraju ar rehman,maniratnam,  మరో ‘మణి’ పూస...!
మరో ‘మణి’ పూస...!
Advertisement
Ads by CJ

మణిరత్నం చాలా కసితో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓకే కన్మణి’. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత దిల్‌రాజు ‘ఓకే బంగారం’ టైటిల్‌తో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్‌ 4న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. తమిళంలోనూ అదే తేదీన ఆడియో విడుదలకానుండటం విశేషం. రెహ్మాన్‌`మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి ఆల్బమ్‌ ఓ ఆణిముత్యంగానే నిలిచింది. కాగా ఈ తాజా చిత్రం ఆల్బమ్‌ కూడా ఓ మణిపూసగా మారనుందనే టాక్‌ వినిపిస్తోంది. తెలుగులో ఈ చిత్రంలోని పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందిస్తున్నాడు. మొత్తం తొమ్మిది పాటలున్న ఈ ఆల్బమ్‌ మణిరత్నం స్టైల్‌లో రెహ్మాన్‌ అభిరుచికి అనుగుణంగా ఉంటుందని యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ చిత్రం హైలైట్స్‌లో పి.సి.శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ మరో హైలైట్‌గా నిలవనుంది. కాగా ఇందులో తుల్కర్‌సల్మాన్‌, నిత్యామీనన్‌లు జంటగా నటించారు.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ