Advertisementt

బ్రహ్మీ సాయంతో గట్టెక్కాలని ప్లాన్‌ చేస్తున్న రామ్‌

Fri 03rd Apr 2015 03:46 AM
ram,pandaga chesko,weekend venkatrao,brahmanandam  బ్రహ్మీ సాయంతో గట్టెక్కాలని ప్లాన్‌ చేస్తున్న రామ్‌
బ్రహ్మీ సాయంతో గట్టెక్కాలని ప్లాన్‌ చేస్తున్న రామ్‌
Advertisement
Ads by CJ

ఇప్పటికే దాదాపుగా షూటింగ్‌ పూర్తి చేసుకొన్న రామ్‌ తాజా చిత్రం ‘పండగచేస్కో’ విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ చిత్రం మే 14న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. తన గత చిత్రాలైన ‘ఒంగోలు గిత్త, మసాలా’ వంటి సినిమాలు అనుకున్న రేంజ్‌లో విజయం సాధించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘పండగచేస్కో’ ద్వారా మన ముందుకు వస్తున్నాడు. రామ్‌, బ్రహ్మానందంల కామెడీ ఈ చిత్రానికి కీలకం అంటున్నారు. వీకెండ్‌ వెంకట్రావ్‌గా తన పాత్రతో బ్రహ్మానందం అదరగొట్టనున్నాడని తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘రెడీ’ చిత్రం ఎంతటి సక్సెస్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అవ్వనుందని యూనిట్‌ ధీమాగా ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ