Advertisementt

స్పెయిన్‌లో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌...!

Thu 02nd Apr 2015 06:59 AM
devisriprasad,sukumar,ntr,dandayathra,rakul preeth singh  స్పెయిన్‌లో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌...!
స్పెయిన్‌లో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌...!
Advertisement
Ads by CJ

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాతగా ఓ చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలో యూకెలో ప్రారంభం కానుందని సమాచారం. కాగా తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్‌ సుకుమార్‌, సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్‌ తన బృందంతో కలిసి స్పెయిన్‌లో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌కు వెళ్లారని సమాచారం. సినిమాకి సంబంధించిన ట్యూన్స్‌ సమకూర్చేపనిలో ఏప్రిల్‌ 9వరకు వీరు ఇక్కడే ఉండనున్నారు. ఈ చిత్రం కోసం ‘దండయాత్ర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలకపాత్రను జగపతిబాబు పోషిస్తుండగా, హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది. ఇటీవల ఆమె ఈ చిత్రం నుండి బయటకు వచ్చేసిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈ వార్తలను ఖండిరచింది. దీంతో ఆమె హీరోయిన్‌గా నటించనుండటం ఖాయమైంది. జూనియర్‌ ఎన్టీఆర్‌కు 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఫుల్‌ మేకోవర్‌లో కనిపిస్తాడట. ఇప్పటికే ‘టెంపర్‌’లో తన లుక్‌తో ఆకట్టుకున్న ఎన్టీఆర్‌ సుకుమార్‌ సలహాపై మరో మంచి లుక్‌కు ప్రయత్నిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ