శృంగార తార సన్నీ లియోన్ రెమ్యునరేషన్ నిర్మాతలకు చుక్కలు చూపెడుతుంది. సినిమా కథ, ఇతర నటీనటులు, సినిమా బాగుందా..? లేదా..? అనే విషయాలను పక్కన పెడితే.. సినిమాలో సన్నీ లియోన్ ఉంటె చాలు అనే అభిప్రాయం ప్రేక్షకులలో ఏర్పడింది. పోస్టర్ మీద సన్నీ ఫోటోను, పేరును చూసి థియేటర్ల ముందు బారులు తీరే జనాలు ఎక్కువ శాతం ఉన్నారు. దాంతో, క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని సన్నీ భావిస్తుంది.
గత ఏడాది హిందీలో ఘన విజయం సాధించిన అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'గ్రాండ్ మస్తీ'కు సీక్వెల్ తీయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మే నెలలో షూటింగ్ మొదలవుతుంది. 'గ్రాండ్ మస్తీ రిటర్న్స్' పేరుతో రూపొందే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించమని సన్నీని సంప్రదించారు. మిడ్ డే పత్రిక కథనం ఈ శృంగార తార రెండు నుండి మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. నిర్మాతలకు చుక్కలు కనిపించడంతో వెనక్కు వచ్చేశారు. ఇతర హీరోయిన్ల వైపు చూస్తున్నారు. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే, సన్నీ ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.