రవిబాబు దర్శకత్వం వహించిన చివరి మూడు చిత్రాలలో పూర్ణ కథానాయికగా నటించింది. మలయాళంలో పలు చిత్రాలలో నటించిన ఆమెకు తెలుగులో చెప్పుకోదగ్గ రీతిలో అవకాశాలు రాలేదు. ఎక్కువగా రవిబాబు చిత్రాలలో నటించడంతో దర్శకుడికి, పూర్ణకు మధ్య ఏదో నడుస్తుందంటూ గుసగుసలు మొదలయ్యాయి. పూర్ణతో సన్నిహితంగా ఉండడం వలనే ఆమెకు రవిబాబు అవకాశాలు ఇస్తున్నారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వీటిని రవిబాబు ఖండించారు.
పూర్ణ మంచినటి. అందుకే ఆమెకు అవకాశాలు ఇచ్చాను. ఒక సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమాలో నటీనటులతో గానీ, సహాయ దర్శకులతో గానీ కనీసం ఫోనులో కూడా మాట్లాడను. వాళ్ళతో సంబంధం ఉండదు. నాకంటూ కొన్ని నియమాలు, విలువలు ఉన్నాయి. నాకు హీరోయిన్‌తో ఎఫైర్ ఉందనడంలో అర్ధం లేదు. అని సమాధానమిచ్చారు.