Advertisementt

పవన్‌ రావడం మాత్రం పక్కా....!

Wed 01st Apr 2015 09:52 AM
gopala gopala,gabbarsingh2,power fame,bobby,70 crore budget  పవన్‌ రావడం మాత్రం పక్కా....!
పవన్‌ రావడం మాత్రం పక్కా....!
Advertisement
Ads by CJ

‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత మూడునెలలుగా మేకప్‌ వేసుకోని పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం ‘గబ్బర్‌సింగ్‌2’ చిత్రం అసలు ఉంటుందా? లేక ఆగిపోనుందా? అనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. కానీ పవన్‌ సన్నిహితులు మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. ‘గోపాల గోపాల’లో పవన్‌ చెప్పినట్లు రావడం కాస్త లేటవ్వవచ్చేమో గానీ...రావడం మాత్రం పక్కా... అనే డైలాగ్‌ను వారు వినిపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్‌ చివరి వారంలోగానీ లేదా మే 1వ తేదీన కానీ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ చిత్రానికి పవన్‌ మే చివరి వారం నుండి డేట్స్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ‘పవర్‌’ ఫేమ్‌ బాబి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం 70కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రం ప్రారంభమైన తర్వాతే ఆయన మిగతా ప్రాజెక్ట్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తాడని అంటున్నారు. మొత్తానికి ఈ వార్త మెగాభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే మరి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ