Advertisementt

రాజీకొచ్చిన శ్రుతి..!

Wed 01st Apr 2015 04:15 AM
shruthi hasan,vamsi padipally,multi starer movie,producers  రాజీకొచ్చిన శ్రుతి..!
రాజీకొచ్చిన శ్రుతి..!
Advertisement
Ads by CJ

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది. కానీ కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేక శ్రుతి ఆ సినిమా నుండి తప్పుకుంది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా పిక్చర్ హౌస్ మీడియా అధినేతలు ఆమెపై కేసు కూడా నమోదు చేసారు. దీంతో ఏంచేయాలో తెలియక శ్రుతి తన ఆలోచన మార్చుకుందట. తిరిగి మల్టీ స్టారర్ లో నటించడానికి అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. నిర్మాతలతో గొడవ ఎందుకు అని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుందని తెలుస్తోంది. మొత్తానికి శ్రుతి దిగొచ్చి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది. అయితే శ్రుతి తప్పుకుందని దర్శకనిర్మాతలు తమన్నాను సంప్రదించారు. కానీ ఇప్పుడు శ్రుతి నటించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ