స్టార్ హీరోల చిత్రాల దర్శకులు బడ్జెట్‌ను కంట్రోల్‌లో వుంచగలిగితే ప్రతి నిర్మాత సినిమా విడుదలకు ముందే ఆర్థికంగా సేఫ్‌జోన్‌లో వుండొచ్చు.అయితే నేటి తరం దర్శకుల్లో నిర్మాత శ్రేయస్సు గురించి ఆలోచించే వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కాగా దర్శకుడు సుధీర్ వర్మ మాత్రం అచ్చంగా ఈ కోవలోనే చేరతాడని అంటున్నాయి సినీ వర్గాలు. తక్కువ బడ్జెట్‌తో రిచ్ క్వాలిటీతో ‘స్వామిరారా’ అనే సినిమా తీసి ఓ ట్రెండ్‌ని క్రియేట్ చేసిన సుధీర్ వర్మ తన తాజా చిత్రం ‘దోచెయ్’కు కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యాడట. నాగచైతన్యకున్న మార్కెట్ రేంజ్‌కు మించకుండా..సినిమాకు అవసరమైన చోట మాత్రమే ఖర్చు పెట్టి.. అనవసర హంగామాల జోలికి వెళ్లకుండా బడ్జెట్‌ను కంట్‌ల్ చేస్తూ చిత్రాన్ని తెరకెక్కించాడట. తక్కువ ఖర్చుతో రిచ్ అవుట్‌పుట్‌ను ఎలా రాబట్టుకోవాలో సుధీర్‌వర్మకు చాలా బాగా తెలుసని ‘దోచెయ్’ చిత్ర యూనిట్ సభ్యులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుధీర్ వర్మ బడ్జెట్‌ను కంట్రోల్‌లో వుంచడం వల్లే నేడు ‘దోచెయ్’ సినిమా నిర్మాతకు ప్రాఫిట్స్‌ను తెచ్చిపెడుతుందట.. అంతేకాదు సినిమా కూడా నాగచైతన్య కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ‘దోచెయ్’ యూనిట్ సభ్యులు.